తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఫ్యామిలీ అండ్ కామెడీ సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా వెంకటేష్ కెరీర్లోనే గొప్పగా నిలిచిపోదగ్గ సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పాలి. ఈ చిత్రానికి కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. అంతేకాదు.. ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించాడు.