జీవిత ఈ అంశంపై ఓ ఇంటర్య్వూలో స్పందించింది. బండ్ల గణేష్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని జీవిత తెలిపింది. అంతే కాకుండా బండ్ల గణేష్ మాటలు తనను హర్ట్ చేశాయని జీవిత తెలిపింది. మా గురించి పనులు చేయగలిగితే చేయాలని పర్సనల్ విషయాలు మాట్లాడవద్దని జీవిత అన్నారు. మా కోసం ఇల్లు కడతామంటున్నారని 100 మందికి ఇల్లు కడితే సరిపోతుందా అని జీవిత ప్రశ్నించారు. ప్రకాష్ రాజ్ తో తాము మాట్లాడామని 150 మందికి ఇల్లు కట్టించడంతో పాటు వారు జీవితాంతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లానింగ్ చేశామని చెప్పారు. ఫండ్ కోసం డబ్బులు ఎక్కడ నుండి తీసుకురావాలో కూడా చర్చించామని చెప్పారు. అసలు మాలో ఏం జరింగిందో..ఏం మంచి జరిగిందో బండ్ల గణేష్ కు తెలియదని అన్నారు. బండ్ల గణేష్ తాను జీవిత రావడంతో నేను బయటి వచ్చాను. గెలిచి తీరతాను అని ఉంటే అతను హీరో అని కానీ ఇప్పుడు ఆయన జీరో అని జీవిత వ్యాఖ్యానించారు.