వినాయక చవితి సంధర్భంగా RRR సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని భావించారు అభిమానులు.కానీ ఈసారి కూడా అభిమానులకు నిరాశ తప్పదని తెలుస్తోంది.వినాయక చవితికి ఆర్ ఆర్ ఆర్ నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదని,త్వరలోనే ఆర్ ఆర్ ఆర్ మేకర్స్ ఓ ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ డేట్ వాయిదాకు సంబంధించిన ప్రకటన చేస్తారని సమాచారం అందుతోంది.