'సీటీమార్' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో గోపిచంద్.. ఓటీటీ, థియేటర్ వ్యవస్థ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలో గోపిచంద్ మాట్లాడుతూ..'ఏ సినిమా అయినా థియేటర్లో చూస్తేనే బాగుంటుంది.అందరూ థియేటర్ కోసమే సినిమా చేస్తారు.ఇక ఓటీటీల్లో విడుదల చేసుకోవడంలో కూడా ఎలాంటి తప్పులేదు.ఏ సినిమా అయినా థియేటర్లో చూస్తేనే కిక్.ఓ సీన్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో థియేటర్ లోనే తెలుస్తుంది.ఓ సినిమాని ఎన్ని రోజులని అపుకొని కూర్చుంటాం? బయటికి వెళ్ళాలి కదా' అంటూ చెప్పుకొచ్చాడు గోపిచంద్