బాలీవుడ్ లో అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సింగ్ చద్దా'.ఈ సినిమాలో నాగ చైతన్య ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో నాగ చైతన్య పోషిస్తున్న పాత్రలో అమీర్ ఖాన్ మొదట నాని ని తీసుకోవాలని ఆయన్ని సంప్రదించగా..అప్పటికే నాని వేరే సినిమాలతో బిజీగా వుండటం.. డేట్స్ కూడా క్లాష్ అవ్వడంతో ఆ ఆఫర్ కి ఓకే చెప్పలేకపోయారు నాని.ఇక ఆ తర్వాత అక్కినేని హీరో నాగ చైతన్య ని ఆ పాత్ర కోసం ఎంపిక చేశారు.