బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 ప్రస్తుతం 19 మంది కంటెస్టెంట్స్ తో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే బిగ్ బాస్ స్టార్ట్ అయి వారం కావచ్చింది. వీకెండ్ ఎపిసోడ్ లో భాగంగా సెట్ అండ్ కట్ గేమ్ లో హౌజ్ మేట్స్ మాత్రం ఒకరినొకరు నామినేషన్స్ రేంజ్ లో రెచ్చిపోయారు. హౌజ్ లో ఇప్పటివరకు మీకు ఎవరితో సెట్ అయ్యింది.. ఎవరితో కట్ అయ్యింది అనే గేమ్ ని ఆడించారు నాగార్జున.సరిగ్గా ఇక్కడే ఆర్ జే కాజల్ ని టార్గెట్ చేశారు హౌస్ మేట్స్.కాజల్ ఫోటోని చింపి పారేశారు.