ప్రతీసారి బిగ్ బాస్ హౌస్ లోకచ్చితంగా ఒక ప్రేమాయణంనడుస్తోందదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రేమాయణానికి హోస్ట్ గా వ్యవహరించే కింగ్ నాగార్జునే నీళ్లు పోస్తారు.గత రెండు సీజన్లను ఒకసారి చూసుకుంటే ఇదే జరిగింది.ఇక ఈసారి కూడా అలాగే జరుగుతున్నట్లు అర్థం అవుతుంది. కెప్టెన్ అయిన సిరి,తనకు సెట్ అయిన వారిగా షణ్ముక్ జస్వంత్ పేరును తెలుపగా, అదే సమయంలో అరె ఏంట్రా ఇది అని నాగార్జున అనడం.. దానికి షణ్ముక్ ముసి ముసి నవ్వులు నవ్వడం చూస్తుంటే ఈసారి బిగ్ బాస్ హౌస్ లో లవర్ బాయ్ గా నిలిచేది షణ్ముక్ జస్వంత్ అని అనిపించక మానదు.