తాజాగా వినాయక చవితి సంధర్భంగా ఓ ఛానెల్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రోజా హాజరైంది.ఈ సందర్భంగా ఆమె తన గతాన్ని గుర్తు చేసుకొని ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.ఇక సెల్వమణితో పెళ్లి ఓకే అనుకున్న తర్వాత.. తన అన్నను బాగా సెటిల్ చేయాలని 'సమరం' అనే సినిమా చేశానని..దాంతో తమ జీవితాలు మొత్తం ఆ సినిమా టైటిల్ కి తగ్గట్లు మారిపోయిందని పేర్కొన్నారు.ఆ సినిమా ప్లాప్ కావడంతో అప్పుల పాలయ్యామని..ఆ అప్పులు తీర్చడం కోసం 2002 వరకు అప్పులు కడుతూనే ఉన్నామని అన్నారు.