టాలీవుడ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజుకి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతుంది. అయితే తేజు యాక్సిడెంట్ గురించి ఇప్పటికే మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి.ఈ విషయం పక్కన పెడితే నిర్మాత మహేష్ కోనేరు ట్విట్టర్ వేదికగా తేజు యాక్సిడెంట్ కి సంబంధించిన వివరాలను రాసుకొచ్చారు.తేజు కి యాక్సిడెంట్ అయినప్పుడు సీసీ టీవీల్లో రికార్డు అయిన వీడియో ఫుటేజ్ ని షేర్ చేస్తూ..ఓ ఆసక్తికరమైన అంశాన్ని రాసుకొచ్చారు మహేష్ కోనేరు.