టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎన్నో మలుపుల అనంతరం ప్రస్తుతం ఈ కేసును ఈడీ విచారిస్తోంది. ఈడీ ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురికి నోటీసులు పంపగా వరుసగా విచారిస్తోంది. అంతేకాకుండా ఈ కేసుపై ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఇప్పటికే టాలీవుడ్ నుండి పలువురిని ప్రశ్నించిన ఈడీ రేపు టాలీవుడ్ నటుడు నవదీప్ ను విచారించనుంది. నవదీప్ కు చెందిన పబ్ లో పార్టీలు జరిగాయని ఈడీ భావిస్తుండటంతో రేపు నవదీప్ విచారణ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకంగా మారనుంది. మొదట డ్రగ్స్ వ్యవహారమంతా సరఫరా దారుడు కెల్విన్ చుట్టూనే తిరిగింది. రవితేజ ను విచారించిన రోజునే ఈడీ అధికారులు కెల్విన్ ను సైతం విచారించారు.