టాలీవుడ్ యాక్షన్ హీరో గోపిచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సీటీమార్' వాయిదాలు పడుతూ ఎట్టకేలకు వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.ఈ సినిమా ట్రైలర్ మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఇక కట్ చేస్తే త్వరలో సంపత్ నంది దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.