ఇటీవల ప్రియమణి నారప్ప సినిమాలో చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా అప్పట్లో దృవ సినిమాలో ప్రియమణి బికనీ షోతో మైండ్ బ్లాక్ చేసింది. అయితే అప్పట్లో బికినీ వేసుకేనేందుకు ప్రియమణి చాలా పుచ్చుకుందని..నిర్మాత బలవంతంతో బికినీ వేసుకునేందుకు ఒప్పుకుందని వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దృవ సినిమా నిర్మాత డీఎస్ రావు ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. ప్రియమణిని దర్శకుడు సినిమాలో బికినీ వేసుకోవాలని కోరడంతో తన తల్లితో మాట్లాడి చెబుతా అని ఐదు నిమిషాల్లో ఓకే చెప్పిందన్నారు. అంతే కాకుండా ప్రియమణి బికినీ వేసుకునేందుకు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదన్నారు.