టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్,స్నేహ జంటగా నటించిన సంక్రాంతి సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.ఈ సినిమా లో వెంకటేష్ తమ్ముళ్లు గా శ్రీకాంత్,శివబాలాజీ, శర్వానంద్ నటించారు.ఈ మూవీలో వెంకటేష్ తర్వాత శ్రీకాంత్ పోషించిన కీలకం అని చెప్పాలి.ఇక ఆ పాత్రలో నిమగ్నమయ్యాడు శ్రీకాంత్. అయితే ఈ పాత్రకోసం ముందుగా మరొక హీరోని అనుకున్నారట. స్క్రిప్ట్ దశలో ఉండగా వడ్డే నవీన్ ని ఈ పాత్ర కోసం తీసుకోవాలని భావించారట.