వెంకీ ఒక్కరే కాకుండా దసరా సీజన్ మీద బాలయ్య కూడా కన్నేశారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం దృశ్యం 2 అక్టోబర్ 13న రిలీజ్ కానుందని తెలుస్తోంది. దీని తరువాత ఒకరోజు కూడా గాప్ లేకుండా తర్వాత రోజైన అక్టోబర్ 14న బాలయ్య నటించిన 'అఖండ' సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారని తెలుస్తోంది.దీంతో ఈసారి ఇద్దరు సీనియర్ హీరోలు అయిన బాలయ్య, వెంకీ ల మధ్య దసరా పోరు గట్టిగానే ఉండబోతోంది.