సైదాబాద్ లో చిన్నారి పై హత్యాచారం చేసిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిధితుడి కోసం టాస్క్ ఫోర్స్ వంద మంది పోలీసులతో వెతుకుతోంది. అయినప్పటికీ నిందితుడి ఆచూకీ లభించకపోవడం తో రివార్డు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది. ఈ మేరకు పోలీస్ శాఖ ప్రకటన కూడా విడుదల చేసింది. చిన్నారిని హతమార్చిన రాజు అనే దుర్మార్గుడిని పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. అంతే కాకుండా నిందితుడిని పట్టించిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ...నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం తో పాటు పది లక్షల రివార్డు ఇస్తామని అన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాత తాము రివార్డు ప్రకటిస్తున్నామని చెప్పారు.