తెలుగు సినీ పరిశ్రమలో చాలా కాలం పాటూ అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి.. నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సీనియర్ నటి రమ్యకృష్ణ.తన సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రభాస్ కి తల్లిగా బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది రమ్యకృష్ణ. ఇక ప్రస్తుతం అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రల్లో నటిస్తున్న రమ్యకృష్ణ ఒక రోజుకు సుమారు పది లక్షల రూపాయల వరకు పారితోషకాన్ని తీసుకుంటుందట.