తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర తారగా ఓ వెలుగు వెలిగింది సీనియర్ నటి రమ్యకృష్ణ.90 ల కాలంలో అప్పటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ ఇమేజ్ ని సంపాదించుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా పలు ప్రయోగాత్మక పాత్రలతో పాటూ నెగెటివ్ రోల్స్ లో కూడా అద్భుతమైన నటనను కనబర్చి.. నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ సీనియర్ హీరోయిన్. తెలుగుతో పాటుగా తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ..మొత్తం ఐదు భాషలలో 200 కి పైగా చిత్రాలలో నటించింది..