టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న ముమైత్ ఖాన్ ఈరోజు ఈడీ విచారణ కు హాజరైంది. ముమైత్ ముంబై నుండి శంషాబాద్ విమానాశ్రయానికి అక్కడి నుండి ఈడీ ఆఫీస్ కు చేరుకుంది. ముమైత్ ఖాన్ ను కెల్విన్ తో ఉన్న సంబంధాలపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ముమైత్ వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు కెల్విన్ కి బదిలీ అయినట్లు గుర్తించిన అధికారులు ఆ దిశగా ప్రశ్నలు కురిపించారు. 2015 వ సంవత్సరం నుండి లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్స్ పత్రాలతో హాజరు కావాలని ముందుగానే ఈడీ ముమైత్ ఖాన్ కు ఆర్డర్ వేసింది. ముమైత్ ను ఈడి దాదాపు ఆరు గంటల పాటు విచారించినట్టు సమాచారం. విచారణ అనంతరం మళ్లీ విచారణకు పిలిస్తే రావాలని అధికారులు ముమైత్ ను ఆదేశించారు. ఇదిలా ఉండగా గతం లో బిగ్ బాస్ హౌస్ నుండి ముమైత్ ఖాన్ డ్రగ్స్ కేసులో విచారణ కు హాజరయ్యారు.