యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించే హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు.కానీ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, కియారా అద్వానీ లలో ఎవరినో ఒకరిని తీసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ ఇద్దరు మాత్రమే కాకుండా కొత్తగా రష్మీక మందన పేరు కూడా వినిపిస్తోంది.