అనతి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి అనన్య నాగళ్ల. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జన్మించిన ఈమె.. బిటెక్ చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేశారు. కానీ సినిమాలు, నటనపై ఉన్న ఇష్టం ఆమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాయి.