బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని తన భర్త పోర్న్ వీడియోల కేసుకు సంబంధించి పోలీసులు విచారించగా ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన ముంబై పోలీసు అధికారులు శిల్పా శెట్టిని పలు కోణాలలో ప్రశ్నించారు. అయితే తన భర్త ఏం చేస్తున్నాడని తాను పట్టించుకోలేదని తన పనిలో తాను బిజీగా ఉన్నానని శిల్పాశెట్టి సమాధానం ఇచ్చింది. శిల్పా శెట్టి స్టేట్మెంట్ ను మొత్తం 1400 పేజీల చార్జ్ షీట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. రాజ్ కుంద్రాకు సంబంధించిన అలాగే రాజ్ కుంద్రా కంపెనీలు అయిన వియాన్ ఇండస్ట్రీస్..రియాన్ తోప్రే లకు సంబంధించిన రికార్టులను కూడా పోలీసు అధికారులతో సహా ఐటీ అధికారులు పరిశీలించారు. ఇక రాజ్ కుంద్రా కేసులో కీలకంగా ఉన్న యశ్ ఠాకూర్, సందీప్ బక్షి లకు సంబంధించి కూడా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు.