పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో మలయాల సూపర్ హట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ భీమ్లా నాయక్ కూడా ఒకటి. ఇక ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న ఈ సినిమాలో రానా కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో రానాకు జోడీగా టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ నటిస్తోందంటూ గత కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ హీరోయిన్ దాదాపుగా రానా పక్కన నటించేందుకు ఖారాయ్యిందని అంతా అనుకున్న సమయంలో మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. భీమ్లా నాయక్ సినిమా నుండి ఐశ్వర్య రాజేష్ తప్పుకున్నట్టుగా టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.