టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తన ఇన్స్టా గ్రామ్ లో ఆసక్తికర పోస్ట్ చేశారు. దట్టమైన పొగలో క్యాప్ పెట్టుకున్నట్టు చరణ్ కనిపిస్తున్నారు. ఇక ఈ ఫోటోకు చరణ్ త్వరలో ఓ అదిరిపోయే వార్త రాబోతుందంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రపంచంలోని వినోదాన్ని మీవద్దకు తీసుకురావడానికి సిద్దమయ్యా అని చరణ్ పేర్కొన్నారు. ఇక చరణ్ ఈ ఫోటో ఎందుకు పోస్ట్ చేశారు..ఏ సినిమా కోసం అని అంతా షాక్ అవుతున్నారు. అయితే టాలీవుడ్ టాక్ ప్రకారం రాంచరణ్ ప్రముఖ ఓటీటీ హాట్ స్టార్ తో ఒప్పందం చేసుకున్నారట. చరణ్ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు ఒప్పందం చేసుకున్నారట.