తెలుగు చిత్ర పరిశ్రమకి అందాల రాక్షసి సినిమాతో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా జోయిన్ అయ్యింది. ఈ సినిమాతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. లావణ్య త్రిపాఠి తన నటన, అందచందాలతో కుర్రకారుల మనస్సును దోచేసుకుంది. ఆమె పలు సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలో మంచి పేరు, గుర్తింపు సొంతం చేసుకుంది ఈ భామ.