శేఖర్ కమ్మల సినిమాలంటే సాధారంగా రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. ఇప్పటి వరకూ ఆయన తీసిన ప్రతీ సినిమా కూడా ప్రేక్షకులకు జీవితంలో ఎక్కడో ఒక దగ్గర కనెట్ట్ అయ్యిందనే భావన వస్తుంది. శేఖర్ కమ్ముల తెరెకెక్కించిన హ్యాపిడేస్ సినిమా ఇంజనీరింగ్ చేసిన చాలా మంది స్టూడెంట్స్ కు కనెక్ట్ అవుతుంది. అందులో ఫ్రెండ్స్ మధ్య ఉండే సంభాషణలు..గొడవలు ప్రేమలు అన్నీ తమ లైఫ్ లోనూ ఉన్నట్టు కనిపిస్తాయి. ఇక ఆనందర్ మంచి కాఫీ లాంటి సినిమా..గోదావరి సినిమా, లై ఈజ్ బ్యూటిఫుల్ కూడా అలాగే ఉంటాయి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ఓ రిచ్ కాలనీ పక్కకు మిడిల్ క్లాస్ వాళ్లు నివాసం ఉంటే ఎలా ఉంటుంది. వారి మధ్య సంబంధాలు ఎలా ఉంటాయన్నదానిని క్లారిటీగా చూపిస్తుంది.