అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ సినిమా చేస్తూ రౌడీ హీరో తన క్రేజ్ ను దేశవ్యాప్తంగా పెంచుకుంటున్నాడు. విజయ్ దేవర కొండ అర్జున్ రెడ్డి కంటే ముందు పెళ్లి చూపులు సినిమా విడుదలైంది. అయితే ముందు షూటింగ్ మాత్రం అర్జున్ రెడ్డి సినిమాదే పూర్తయ్యిందట. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడటంతో పెళ్లి చూపులు సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఆ తరవాత అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చాడు. ఇక పెళ్లి చూపులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా రౌడీ హీరోకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నిజానికి పెళ్లి చూపులు సినిమాతోనే ప్రేక్షకులు విజయ్ కి అభిమానులు అయ్యారు.