టాలీవుడ్ స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబో వచ్చిన జులాయి, అల వైకుంఠపురంలో సినిమాలు టాలీవుడ్ రికార్డులను షేక్ చేశాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికి జులాయి, అల వైకుంఠపురం రేంజ్ లో హిట్ టాక్ తెచ్చుకోలేదు. అయితే వీరిద్దరూ మరోసారి జతకట్టారు. కానీ ఈసారి అల్లు అర్జున్ త్రివిక్రమ్ జత కట్టింది సినిమా కోసం కాదు ఓ యాడ్ షూట్ కోసం. త్రివిక్రమ్ మరియు అల్లు అర్జన్ కలిసి రాపిడో బైక్స్ యాప్ కోసం యాడ్ షేట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాలతో పాటు యాడ్స్ కూడా చిత్రిస్తుంటారు.