మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టోరీ సినిమా ఆడియో ఫంక్షన్ లో మెరిసారు. ఈ సంధర్బంగా మెగాస్టార్ తన స్పీచ్ తో అదరగొట్టారు. అయితే చివరగా మాత్ర మెగాస్టార్ ఎమెషనల్ అయ్యారు. సినిమా టికెట్ల అంశం గురించి మాట్లాడుతూ మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ మాట్లాడుతూ...కరోనా లాక్ డౌన్ తరవాత స్కూల్ కు వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు సినిమా ఫంక్షన్స్ కు రావడం అంతే సంతోషంగా ఉందని మెగాస్టార్ అన్నారు. సినిమా కార్యక్రమాల్లో మిత్రులను కలిసి అలాగే ప్రేక్షకుల చప్పట్లు విని చాలా రోజులు అవుతోందని చెప్పారు. ఈ మధ్య తనను ఎవరైనా టీజర్, ట్రైలర్ లాంఛ్ చేయమని అడిగితే, ఇంట్లో కూర్చుని లాప్ టాప్ లో చేస్తూ ఉన్నానంటూ మెగాస్టార్ అన్నారు. కానీ బయటకొచ్చి ఆడియన్స్ చప్పట్లు వింటే వచ్చే సంతోషమే వేరని వ్యాఖ్యానించారు.