కారణాలు ఏవయినా డ్యాన్సింగ్ బ్యూటీ సాయి పల్లవి ఇండస్ట్రీలో చాలా మంది హీరోలతో నటించేందుకు నో చెప్పిందని అంటుంటారు. అయితే చిన్న హీరో చిన్న సినిమా అనే భేదాలతో సినిమాలను రిజెక్ట్ చేస్తారు కానీ సాయి పల్లవి మాత్రం బడా హీరోల సినిమాలకు నో చెప్పడంతో అంతా షాక్ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ కీలక పాత్రలో నటించేందుకు సాయి పల్లవి నో చెప్పినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంపై మెగాస్టార్ చిరంజీవి లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో అందరి ముందు అడిగేశాడు దాంతో సాయి పల్లవి ఒక్క సారిగా షాక్ అయ్యింది. మెగాస్టార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ... సాయి పల్లవిని ఫిదా సినిమాలో చూసే వరకూ ఆమె ఎవరో తనకు తెలియదని చెప్పారు.