శోబితా అనే ప్రభాస్ అభిమాని పాన్ ఇండిమా స్టార్ ను చూడాలని కోరుకోవడంతో ఆమె కోరికను తీర్చాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం షూటింగ్ కోసం విదేశాల్లో ఉన్న ప్రభాస్ శోబితాకు వీడియో కాల్ చేసి మాట్లాడారు. దాంతో శోబితా ఎంతో ఆనందపడింది. తన కోసం ఎంతో బిజీగా ఉండే ప్రభాస్ ఫోన్ చేశాడని శోబితా కుషీ అయ్యింది. ఇక ప్రభాస్ క్యాన్సర్ తో పోరాడుతున్న శోబితకు ఎంతో ధైర్యం చెప్పారు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం సలార్, ఆది పురుష్ అనే రెండు పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు.