టాలీవుడ్ బ్యూటీ అక్కినేని సమంత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు థ్యాంక్స్ చెప్పింది. సమంత నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కాతు వాకుల్ రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ సినిమా నుండి టు టూ టు టూ అనే పాటను విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ పాటకు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా ఫిదా అయ్యింది. తన సోషల్ మీడియాలో పాటను షేర్ చేసిన ప్రియాంక చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించింది.