యాంకర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన భామ అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సినిమాలు..టీవీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇది వరకూ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో ఫోటో షూట్ లను పోస్ట్ చేసేది కానీ ఇటీవల కాలంలో అనసూయ రచ్చ సోషల్ మీడియాలో తగ్గినట్టుగానే కనిపిస్తోంది. దానికి కారణం రంగమత్త సినిమాలు టీవీ షోల షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉండటమే అని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో రంగమత్త ఓ ఫోటోతో అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. అంతే కాకుండా తన ఫోటోతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు అనసూయ స్పష్టం చేసింది.