మంచి కొరియోగ్రాఫర్ గా రాజు సుందరంకు గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తమిళంలో సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తుంటారు. ఇక రాజు సుందరం తోనే శర్వానంద్ తరవాత సినిమా ఉండబోతుందంటూ వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం వీరి కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయ్యిందట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి విరరాలను రాజు సుందరం మరియు శర్వానంద్ వెల్లడించనున్నారట. అయితే కెరీర్ లో ఎంతో సతమతమవతున్న శర్వానంద్ ఇప్పుడు రాజు సుందరం ను నమ్ముకోవడం అంటే పెద్ద రిస్క్ చేస్తున్నట్టే అని చెప్పాలి.