ఇక టాలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ కూడా తన మొదటి భార్యతో విడిపోయాడు. ప్రకాష్ రాజ్ మొదటగా తమిళ ఇండస్ట్రీకి చెందిన లలిత కుమారి అనే నటిని వివాహం చేసుకున్నాడు. ఈ జంట కొన్నేళ్లపాటు చాలా అన్యోన్యంగా కలిసి ఉండి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఇక ప్రకాష్ రాజ్ లలిత కుమారి జంటకు ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. సిద్దూ, మేఘన, పూజా అనే ముగ్గురు సంతానం ఉండగా వీరంతా కలిసి ఉండేవారు. అయితే అన్ని అనుకున్నట్టుగా జరుగుతున్న ప్రకాష్ రాజ్ లలిత కుమారి జీవితంలో తమ కుమారుడు సిద్దూ మరణం విషాదాన్ని నింపింది.