సాధారణంగా స్టోర్ట్స్ స్టార్ లకు మరియు సినిమా తారలకు మంచి సంబంధాలు ఉంటాయి. ఎలా కుదురుతుందో తెలియదుగానీ చాలా ఈవెంట్లలో సినిమా తారలతో కలిసి స్పోర్ట్స్ స్టార్స్ కనిపిస్తుంటారు. ఇక హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు కూడా సినిమా వాళ్లతో ఎక్కువగా కనిపిస్తుంటారు.ఇటీవలే పీవీ సింధూ రామ్ చరణ్ మరియు అక్కినేని అకిల్ తో కలిసి ఓ ఈవెంట్ కు హాజరు కాగా దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యియి. అయితే తాజాగా పీవీ సింధు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే తో కలిసి బ్యాట్మింటన్ ఆడినట్టు దీపికా పదుకునే సోషల్ మీడియాలో వెల్లడించింది.