ఇదిలా ఉండగా ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. అంతే కాకుండా హైదరబాద్ లోని జీవీకే మాల్స్, ఏ ఎంబీ సినిమాస్, ప్రాసాద్ మల్టీ ప్లెక్స్ లో దాదాపుగా టికెట్లు బుక్ అయినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లలోనూ లవ్ స్టోరీ సినిమా టికెట్లకు భారీ గిరాకీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అందమైన ప్రేమకథ చిత్రాన్ని అమిగో సినిమాస్ మరియు వెంకటేష్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు.