సినిమాలలో షూటింగ్ సమయంలో నటీనటుల మధ్య వివాదాలు తలెత్తడం సాధారణమే. ఏదో ఒక విషయంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేరకంగా ఉండకపోయినా..చిన్న చిన్న ఇష్యూలు రావడం కామన్. అలానే ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య చిన్న ఇష్యూ వచ్చి వివాదం నెలకొంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో తెలుగింటి అమ్మాయిలా ఉండే బొద్దుగుమ్మ నివేధితా తామస్ మరియు తన యాక్టింగ్ గ్లామర్ తో కట్టిపడేసిన హీరోయిన్ రెజీనా మధ్య వివాదం నెలకొందని దాంతో ఇద్దరూ మాట్లాడుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. రెజీనా మరియు నివేధిత సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు.