టాలీవుడ్ లో కరోనా సెకండ్ వేవ్ తరవాత ఎన్నో సినిమాలు థియేటర్ లో విడుదల కాగా లవ్ స్టోరీ కి మాత్రం మిగతా సినిమాల కంటే ఎక్కువ క్రేజ్ కనిపించింది. లవ్ స్టోరీకి దాదాపు నగరంలోని థియేటర్లు అన్నీ ఫుల్ అయ్యాయి. ముందుగానే ప్రేక్షకులు టికెట్ల కోసం పోటీ పడి మరీ బుక్ చేసుకున్నారు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లవ్ స్టోరీ గురించే పోస్టులు కనిపిస్తున్నాయి. సినిమాలో ఏం భాగున్నాయి ఏ అంశాలు భాగా లేవని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక లవ్ స్టోరీ సినిమాలో ఈ అంశాలు హైలెట్ అవుతున్నాయంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు.