టాలీవుడ్ మన్మథుడు నాగార్జున నటవారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. చైతూ ఇప్పటి వరకూ చాలా సినిమాలలో నటించగా ఒక్కో సినిమాలోనూ తన డిఫరెంట్ స్టైల్ తో ఆకట్టుకున్నాడు. మొదటగా చైతూ జోష్ లాంటి మాస్ అండ్ కాలేజీ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలో చైతూ నటన పరవాలేదు అనిపించినా కొన్ని విమర్శలు కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఇక ఆ తరవాత మళ్లీ నాగచైతన్య మాస్ సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ రాలేదు కానీ లవ్ స్టోరీ చిత్రాలతోనే చైతూకు ఎంతో క్రేజ్ వచ్చింది. దాంతో లవర్ బాయ్ గా చైతన్య టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాడు.