శేఖర్ కమ్ముల ఈసారి మరో సరికొత్త పాయింట్ తో 'లవ్ స్టోరీ' అనే సినిమాను తెరకెక్కించాడు. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో,హీరోయిన్లు గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచంలో వ్యాప్తంగా విడుదలైంది.ముఖ్యంగా సినిమాలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ సరికొత్త పాయింట్ ని టచ్ చేసాడు.కుల, మత వివక్ష లాంటి సున్నితమైన,క్లిష్టమైన అంశాలకి తోడుగా ప్రస్తుత సమాజంలో పిల్లల పై లైంగిక దాడులు అనే.. సెన్సిబుల్ పాయింట్ తో కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు..