అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'లవ్ స్టోరీ'.ఈ సినిమాలోని పాటలు ఆడియన్స్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలోని 'సారంగదరియా' పాట అయితే యూట్యూబ్ లో 325 మిలియన్ మార్క్ వ్యూస్ ని క్రాస్ చేసి రికార్డులు నెలకొల్పింది. పాటలకి సంగీతం అందించింది నూతన సంగీత దర్శకుడు పవన్. తన సంగీతంతో ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించారు పవన్.