అక్కినేని హీరో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తాజాగా సెప్టెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఈ సినిమాకి ప్రతీ ఒక్కరి నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. ఇక కరోనా సెకండ్ వేవ్ తర్వాత భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమా ఇది. ఇక వరల్డ్ వైడ్ గా సుమారు 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ని సొంతం చేసుకుంది..