ఇటీవల బిగ్ సి బ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన్న మహేష్ బాబు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, అలాగే వెబ్ సీరీస్ లో నటించే ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయంపై స్పష్టత ఇచ్చాడు. ఈ నేపథ్యంలో మహేష్ మాట్లాడుతూ..'నేను ఎప్పుడూ వెబ్ సీరీస్ చేయాలని అనుకోలేదు.ప్రస్తుతం నేను వాటిని చూసే పనిలో మాత్రమే ఉన్నాను.ఇక ఇప్పటివరకు నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు.కానీ ఎవరికి తెలుసు. భవిష్యత్ లో ఉండవచ్చు'.. అంటూ మహేష్ బాబు వివరణ ఇచ్చారు