తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కేవలం ఒక్క సిట్టింగ్ లోనే సర్కారు వారి పాట సినిమాకు ఓకే చెప్పానని మహేష్ తెలిపారు.సర్కారు వారి పాట సినిమా కథ తనకు ఎంతో నచ్చిందని..సర్కారు వారి పాట పోకిరి సినిమాకు ఏమాత్రం తగ్గదని మహేష్ బాబు వెల్లడించారు.ఈ సినిమా కచ్చితంగా పోకిరి వైబ్స్ ని తీసుకొస్తుందని మహేష్ బాబు పేర్కొన్నారు.