టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తో పూరీ జగన్నాథ్ ఓ సినిమా చేయాలని గత కొంతకాలంగా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ బర్త్ డే అయిన సెప్టెంబర్ 28 న బాలయ్య తో పూరి చేసే ప్రాజెక్ట్ గురించి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.