అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం గత కొంతకాలంగా విడుదల తేది కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటించి..మళ్ళీ క్యాన్సిల్ చేశారు. తాజాగా మరో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్.అక్టోబర్ 15 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.