మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ఈ వేడుకలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ వ్యాఖ్యలపై తీవ్ర మైన చర్చ జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి ఏపీ మంత్రులు,వైకాపా నాయకులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.