ప్రస్తుతం పవన్ చేతిలో కొత్త సినిమాలు దండిగా ఉన్నాయి. వాటిలో భీమ్లా నాయక్ ముందుగా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమా విడుదల సమయానికి పవన్, వైసీపీ మధ్య గొడవలు మరింత ముదిరిపోతాయా, లేక సినీ ఇండస్ట్రీతో వైసీపీ ప్రభుత్వం చర్చలు సఫలం అవుతాయా అనేది చూడాలి. అవేవీ కుదరకపోతే మాత్రం పవన్ సినిమాలకు ఓటీటీలే దిక్కవుతాయి.