వకీల్ సాబ్ సినిమాతో దిల్ రాజుకి బాగానే గిట్టుబాటయిందనే ప్రచారం ఉంది. ఒకరకంగా దిల్ రాజు సేఫ్ అయినా.. పవన్ కల్యాణ్ తో కొత్త సినిమాలు చేస్తున్న నిర్మాతలు మాత్రం ఇప్పుడు ఆందోళనతో ఉన్నారు. కొత్త సినిమాల విడుదల వ్యవహారంలో ప్రభుత్వం మోకాలడ్డుతుందేమోనని టెన్షన్ పడుతున్నారు. సినిమా వేదికపై పవన్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు తమని ఇబ్బందికి గురి చేసేలా ఉన్నాయంటూ లోలోపల మథన పడుతున్నారు. పవన్ తోపాటు.. మెగా హీరోలతో సినిమాలు మొదలు పెట్టిన నిర్మాతల్లో కూడా ఒకరకమైన ఆందోళన మొదలైంది.