తెలుగు సినీ పరిశ్రమకు సుపరిచితుడు అక్కినేని నాగేశ్వరరావు. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. నాటకాల ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించిన నాగేశ్వరరావు ఎన్నో సినిమాల్లో నటించారు. ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగారు. అయితే చిన్నతనం నుంచే నాగేశ్వరరావుకు నాటకాలంటే పిచ్చి ఎక్కువ. సినీ ఇండస్ట్రీకి పరిచయం కాకముందు నాటకాల్లో నటించేవారు.